స్వతంత్ర వెబ్ డెస్క్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసుకొని.. పట్టపగలే భారీ చోరీలకు పాల్పడుతున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ముందు రెక్కీ నిర్వహించి.. ఏ ళ్లకు తాళం వేసి ఉందో చూసుకొని పక్కా స్కెచ్ ప్రకారం ఆ ఇళ్లను దోచుకెళ్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లా గడివేలుమల మండలంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.
గడివేముల మండలం మంచాల కట్ట గ్రామంలో SC కాలనీలో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి తాళాలు బద్దలగొట్టి.. రూ.7 లక్షల రూపాయల నగదు, 14 తులాల బంగారు ఆభరణాలను అపహరించాలని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.


