ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వగ్రామంలో టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి. ఎన్నికల ప్రచారం భాగంగా కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డి బేతంచర్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి మండలంలోని అన్ని గ్రామాల టీడీపీ శ్రేణులు, బీజేపీ, జనసేన కార్యకర్తలు తరలిరావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. రోజులు గడిచే కొద్దీ కోట్ల బలం పెరగటంతో బుగ్గన పక్కన ఉన్న వాళ్లు కూడా టీడీపీ వైపు రావడంతో వైసీపీలో మరింత ఆందోళన మొదలైంది. ఈ ర్యాలీ భారీ ఎత్తున విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో హుషారు మరింత రెట్టింపు అయింది.