సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ సర్కార్ నేతన్నలపై కక్ష కట్టిందని విమర్శించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లును వెంటనే చెల్లిం చాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత మిత్ర పథకాలు పక్కన పెట్టొద్దని… గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టకొ ట్టొద్దని సూచించారు. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అవస రమైతే మరింత సాయం చేసి ఆదుకోవాలన్నారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.


