ఏపీ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్(KTR) ఎంటర్ అయ్యారు. టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి(BRS)గా మారిన తర్వాత ఏపీ సమస్యలపై ఆ పార్టీ నేతలు గళం విప్పుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని కోరారు. కార్పొరేట్లకు రూ.12.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు ఔదార్యం చూపడం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ఉత్పత్తులను కేంద్రం కొనుగోలు చేయడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్‌కు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలని.. సెయిల్‌లో విలీనంపై పరిశీలించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్(BRS) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు కేటీఆర్.