మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ…
పరువు నష్టం దావా వేసిన కేసులో ఆయన విచారణకు హాజరు కానున్నారు. విచారణలో భాగంగా కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనుంది న్యాయస్థానం.
ఈ నెల 18వ తేదీన వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు రావాలన్న ఆదేశాల మేరకు ఇవాళ న్యాయస్థానం ముందుకు రానున్నారు కేటీఆర్. కేటీఆర్‌తోపాటు ఈ కేసులో బిఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రావణ్‌ల సాక్ష్యాలను కూడా రికార్డు చేయనుంది కోర్టు. ఈ నేపథ్యంలోనే వారు కూడా నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.