16.7 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదని.. యువతకు మిగిలింది విలాపమే అని అన్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్‌ పబ్లిసిటీ చేసుకుంటుందని కేటీఆర్ మండిపడ్డారు. 55వేల 143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ మాటలు చెబుతుందని విమర్శించారు. ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12వేల 527 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలు ఇస్తూ గొప్పలు చెబుతున్నారని తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్