ఢిల్లీలో మాజీ మంత్రి కేటీఆర్ బిజిబిజీగా ఉన్నారు. అమృత్ స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ –టెండర్ల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు జరిగితే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ 4 పేజీల కంప్లయింట్ లెటర్ ను కేంద్రమంత్రికి అందజేశారు.
అమృత్ 2.0 స్కీం లో భాగంగా తెలంగాణలో కేంద్రం వివిధ పనులకు దాదాపు 8వేల 888 కోట్లు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. ఇందులో సీఎం అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి, తన బామ్మర్ది సుజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి ఒక వెయ్యి 137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని పేర్కొన్నారు. తన బామ్మర్ది కంపెనీ అనే ఒక్క కారణంతోనే పనులను కట్టబెట్టారని ఆరోపించారు.