స్వతంత్ర వెబ్ డెస్క్: వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న టెక్స్‌టైల్ పార్కుకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 261 ఎకరాల్లో రూ.900 కోట్లతో టెక్స్‌టైల్ పార్కు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. యంగ్ వన్ కంపెనీ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయనుంది. భూమిపూజ అనంతనం కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
నల్ల బంగారం, తెల్ల బంగారం సమృద్ధిగా దొరికే ప్రాంతం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పండే తెల్ల పత్తి ఎక్కడా దొరకదని చెప్పారు. వరంగల్ కు పూర్వ వైభవం కలిగే విధంగా కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొరియా దేశం నుంచి యంగ్ వన్ సంస్థ ముందుకు వచ్చి ఇక్కడ యూనిట్ స్థాపించిందన్నారు. మొత్తం 11 ఫ్యాక్టరీల ఏర్పాటుతో 20 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. 99 శాతం స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మేడిన్ వరంగల్ దుస్తులు అనేక దేశాలకు వెళ్తాయి. యంగ్ వన్ కంపెనీ కొరియాలో పెద్ద పరిశ్రమ. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి. మన దేశంలో వ్యవసాయ, టెక్స్‌టైల్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని కేటీఆర్ తెలిపారు.