బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపో మాపో కవిత(MLC Kavitha) అరెస్ట్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కుటుంబసమేతంగా తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్న ఆయన తెలంగాణ రాజకీయాలపై మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్(KCR) వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తనపై కేవలం 10వేల ఓట్ల తేడాతో గెలిచారని ఎద్దేవా చేశారు. మునుగోడు ఎన్నికల్లో నైతిక విజయం తనదేనన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందువల్లే జాతీయ పార్టీ బీఆర్ఎస్(BRS) అని కొత్త డ్రామాకు కేసీఆర్ తెరలేపారని చెప్పారు. తెలంగాణ ప్రజాస్వామ్యం లేదని.. బీజేపీ(BJP) నాయకత్వంతోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చేనే నిర్ణయంతోనే కాషాయ తీర్థం పుచ్చుకున్నానని ఆయన స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం బీజీపీ అధికారంలోకి రావడం పక్కా అని రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) ఆశాభావం వ్యక్తంచేశారు.