తిరుమల దేవస్థానంలో ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఆలయంలోని ఆనందనిలయం మొద లుకొని బంగారువాకిలి వరకు శుద్ధి చేశారు. శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామపుకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చకర్పూరం, గంధంపొడి, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేశారు. అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమా లను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.


