భారత అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కరాలను కేంద్రం ప్రకటించింది. 2024కు సంబంధించి నలుగురు క్రీడాకారులను ఖేల్‌రత్న అవార్డులకు ఎంపిక చేసింది.
ఒలింపిక్ పతక విజేత షూటర్ మను భాకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ సహా నలుగురు క్రీడాకారులను ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు గురువారం క్రీడా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ప్రవీణ్ కుమార్‌లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డు దక్కనుంది. భారతదేశంలో క్రీడాకారులకు ఖేల్ రత్న అత్యున్నతమైన క్రీడా గౌరవం. క్రీడా మంత్రిత్వ శాఖ అర్జున అవార్డుల కోసం 17 మంది పారా అథ్లెట్లతో సహా 32 మంది అథ్లెట్లను ఎంపిక చేసింది.
ఇటీవల, ఖేల్ రత్నకు సిఫార్సు చేసిన అథ్లెట్ల జాబితాలో మను పేరు లేదని పెద్ద దుమారం రేగింది. మను తండ్రి రామ్ కిషన్, కోచ్ జస్పాల్ రాణా స్నబ్ దీనిపై మండిపడ్డారు. అయితే, నామినేషన్ దాఖలు చేసే సమయంలో తప్పు జరిగి ఉండవచ్చని మను భాకర్ అంగీకరించింది.