ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరా బాద్ మహానగరం లాగే ఖమ్మం పట్టణానికి కూడా ఓటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు నేషనల్ హైవే అథారిటీ అనుమతి కోసం గతంలో ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అందులోని కొన్ని మంజూరు అయ్యాయని వివరించారు. ఖమ్మం జిల్లా సుందరీ కరణలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవేలను తీసుకొచ్చి ట్రాఫిక్ సమస్యను అధిగమిం చేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి.