పది అంశాల అజెండాతో బీజేఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గొడెం నగేష్ హాజరయ్యారు. అలాగే, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్, రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు. బీజేపీలో గ్రూప్ తగాదాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
సమావేశంలో కీలక విషయాలపై చర్చించినట్టు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పది అంశాల అజెండాతో సమావేశం నిర్వహించామని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం నిర్వహించాలని సీఎంకు లేఖ రాయాలని డిసైడ్ చేశామని, రుణమాఫీ కాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. అందరికీ రుణమాఫీ చేసి రైతు భరోసా అమలు చేయాలని చెప్పారు. రైతు సమస్యలపై ఈ నెల 20న దీక్ష చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.