33.2 C
Hyderabad
Friday, April 17, 2026
spot_img

కీలక నిర్ణయం.. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’పై మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీని ఈసారి ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. దేశంలోని 28 పార్టీలు ఏకమై ‘ఇండియా కూటమి‘గా ఏర్పడ్డాయి. తమ కార్యాచరణ ప్రకటించడం కోసం కూటమి మూడుసార్లు సమావేశమైంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘జమిలి’ ఎన్నికలతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిన్న నిర్ణయించింది. ఈ రోజు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.

‘ఒక దేశం – ఒకే ఎన్నిక‘ పేరుతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్ర భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. దేశంలో ఒకేసారి లోక్ సభ, అయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణపై సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీలో 16 మందితో సభ్యులు ఉంటారని తెలుస్తోంది. కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్