వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కోసం పనిచేసిన కార్యకర్తలు బజారున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. శింగనమల నియోజకవర్గంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని పెద్దారెడ్డి ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని.. కార్యకర్తల రక్షణకే తన తొలి ప్రాధాన్యతని తెలిపారు. వైసీపీని అధికారంలోకి తీసుకుని రావడం కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలను మర్చిపోతే నాశనమైపోతారని వ్యాఖ్యానించారు.
బుధవారం అనంతపురం జిల్లాలో జరిగిన సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో దళిత మహిళ ఎంపీపీని స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో పాటు అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. నియంత పాలన ఏమైనా జరుగుతుందా? అని ప్రశ్నిచారు. కాగా రెండ్రోజుల కిందట వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తాడిపత్రి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ బోగతి నారాయణరెడ్డి.. పెద్దారెడ్డి వర్గీయులు పరస్పరం వేట కొడవళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే.