ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకావాలని సీబీఐ జారీచేసిన సమన్లపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. సీబీఐ, ఈడీ సంస్థల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేజ్రీ.. తాను ఆదివారం సీబీఐ విచారణకు హాజరుతానని తెలిపారు. లిక్కర్ స్కాంలో అరెస్టైన వారిని దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ పెద్దలు అరెస్ట్ చేయాలని ఆదేశిస్తే సీబీఐ అరెస్ట్ చేయక తప్పదని తెలిపారు.
ఈ కేసులో అరెస్టైన చందన్ రెడ్డిని అధికారులు కొట్టారని.. అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రను భయపెట్టి వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు. మనీశ్ సిసోడియాను ఈ కేసులో ఇరికించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రధాని మోదీ(MODI)కి రూ.1000కోట్లు ఇచ్చానని చెబితే మోదీని అరెస్ట్ చేస్తారా? అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ చాలా అద్భుతమైన విధానమని.. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగిందని కేజ్రీవాల్(Kejriwal) స్పష్టంచేశారు.
Also Read: లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు