ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ నుంచే తొలి ఆదేశం జారీ చేశారు. ప్రజలకు నీటి కొరత తీర్చేందుకు ట్యాంకర్లను పంపించాలని..వాటర్ బోర్డ్ అధికారులను సీఎం ఆదేశించారు. తాజాగా ఆయన రెండో ఆదేశం జారీ చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరి ష్కరించాలని ఆదేశించారు. తనకు ఆ ఉత్తర్వు శనివారం అందిందని మంత్రి అతిషీ వెల్లడించారు. అయితే ఈ అంశాన్ని ఈడీ తీవ్రంగా తప్పుపట్టింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీ వాల్‌కు తాము కంప్యూటర్ కానీ, కాగితాలు కానీ ఏది సమకూర్చలే దన్నారు. అయినా అవి ఎలా లోపలికి వచ్చాయో, ఆదేశాలు ఎలా బయటకు వచ్చాయనే తెలియడం లేదన్నారు. ఈ విషయంపై సమాచారం తెలుసుకొనేందుకు చర్యలు దిగింది. దీనికి సంబంధించి ఆప్ మంత్రి అతిషీని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలు కు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. తాజా పరిణామం ఎటు దారితీస్తుందో చూడాలి.


