Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలింపు ?

      ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లను తిహార్ జైలులో జుడీషియల్ రిమాండ్ విధించడంతో మీడియాలో తీహార్ జైలు ప్రముఖంగా విన్పిస్తోంది. ఢిల్లీ మధ్యం కుంభ కోణంలో 2023 ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అప్పటి నుంచీ తీహార్ జైలులోనే ఉన్నారు. గతంలోనూ ఎందరో రాజకీయనాయకులు తీహార్ జైలులో ఉన్నారు.. ఇంతకీ తీహార్ జైలు ప్రాముఖ్యం ఏమిటి.. ఆ జైలు చరిత్ర ఏమిటి?

       దేశ రాజధాని ఢిల్లీలోని చాణక్యపురికి 7 కిలోమీటర్ల దూరంలో తీహార్ గ్రామంలో ఉన్న జైలు.. తీహార్ జైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని తీహార్ ఆశ్రమం అనికూడా పిలుస్తారు. ఆసియాలోనే అతిపెద్ద జైళ్ల సముదాయం ఇది. దాదాపు 400 ఎకరాలకు విస్తరించి ఉన్న తీహార్ జైలులో 9 క్రియాశీలక జైళ్లు ఉన్నాయి. దీనిని ఢిల్లీ ప్రభు త్వానికి చెందిన జైళ్ల శాఖ నిర్వహిస్తుంది. ఢిల్లీలోని మూడు జైలు సముదాయాల్లో ఇది ఒకటి. మిగతా రెండు జైళ్ల సముదాయాలు రోహిణి, మండోలిలో ఉన్నాయి. రోహిణీలో మూడు, మండోలీలో ఆరు సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. 1957 ప్రాంతంలో పంజాబ్ ప్రభుత్వం కిందున్న తీహార్ జైలు 1966లో ఢిల్లీ ప్రభుత్వానికి బదిలీ అయింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో విస్తరించింది. తీహార్, రోహిణి, మండోలీలో ఉన్న మొత్తం16 సెంట్రల్ జైళ్ల సామర్థ్యం 10, 026 మంది ఖైదీలు కాగా, ప్రస్తుతం 19,500 మంది ఖైదీలు ఉన్నారు. కొన్ని ఏళ్లుగా ఖైదీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జైళ్లలో రద్దీని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆరు జైళ్లతో మండోలి ప్రిజన్ కాంప్లెక్స్ ను ప్రారంభించింది. నరేలా, బాప్రోలా ప్రాంతాల్లో కొత్త జైళ్లను నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది.

        తీహార్ జైలును జైలు అనడం కన్నా ఖైదీలలో పరివర్తన తెచ్చే సంస్థగా.. కరెక్షనల్ ఇనిస్టిట్యూట్ గా అభివర్ణించారు. సీనియర్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ జైళ్ల శాఖ ఇన్ స్పెక్టర్ జనరల్ గా ఉండగా తీహార్ జైలులో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఖైదీలకు వివిధ వృత్తులలో శిక్షణ, నైపుణ్యం పెంచే కార్యక్రమాలు, చదు వుకునే సౌకర్యం కల్పించడంతో పాటు చట్టం పట్ల గౌరవం, అవగాహన పెంచి వారిని సమాజంలో సాధా రణ సభ్యులుగా మార్చడం ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశం. తీహార్ జైలులో ఖైదీలకు ప్రత్యేక రేడియో స్టేషన్ ఉంది. దీనిని ఖైదీలే నడుపుతారు. ఖైదీలను సంస్కరించి, వారికి పునరావాసం కల్పించేందుకు మ్యూజిక్ థెరపీని ప్రవేశ పెట్టారు. సంగీతంలో శిక్షణ ఇప్పించడంతో పాటు, కచేరీలు కూడా ఏర్పాటు చేస్తారు.

       కిరణ్ బేడీ ఆధ్వర్యంలో తీహార్ జైలులో ఖైదీలకు, జైలు సిబ్బందికి కూడా విపాసన మెడిటేషన్ కార్య క్రమాన్ని ప్రవేశపెట్టారు. ధ్యానం ద్వారా ఖైదీల్లో పరివర్తన తెచ్చే ప్రయోగం చేశారు. దూరవిద్య సౌకర్యం కల్పించి ఖైదీలలో విద్యను ప్రోత్సహించడంతో చాలామంది ఉన్నతవిద్య చదువుకున్నారు యూపీఎస్ సీ,సివిల్ సర్వీసెస్ పరీక్ష లకు హాజరై..ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. జైళ్లలో ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి, హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ ఏర్పాటు చేసి, చేనేత వస్త్రాలు, తివాచీల తయారీ చేపట్టారు. టైలరింగ్, కాగితం తయారీ, షూ తయారీ యూనిట్, బేకరీ ఏర్పాటు చేసి ఖైదీలు శిక్షాకాలంలో పనిచేస్తూ..సంపాదనా పరులయ్యేలా తీర్చిదిద్దు తున్నారు.అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు రావడం ఇదే మొదటి సారి కాదు. అన్నా హజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమం సందర్భంగా కేజ్రీవాల్ 2012 లోనూ, 2014 లోనూ రెండుసార్లు తీహార్ జైలులో ఖైదీగా ఉన్నారు. 2024 మార్చి 22న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి హోదా లో ఉండగానే ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైలులో జుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. తీహార్ జైలులో కేంద్ర ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన పి.చిదంబరం తో సహా గతంలో ఎందరో ప్రముఖులు ఖైదీలుగా ఉన్నవారే. అలాంటి ప్రము ఖుల్లో 2 జీ స్పెక్ట్రామ్ కేసులో అరెస్ట్ అయిన ఏ.రాజా, కనిమొళి, వినోద్ గోయంకా, షాహిద్ బల్వా, సంజయ్ చంద్రా ఉన్నారు.

      కామన్వెల్త్ గేమ్స్ లో అవినీతి ఆరోపణల కేసులో మాజీ కేంద్రమంత్రి సురేశ్ కల్మాడి, ఎస్పీ నేత అమర్ సింగ్ లనూ ఇక్కడే నిర్బంధించారు. గడ్డి కుంభకోణంలో జైలు శిక్ష పడి ప్రస్తుతం రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 2019 ఏప్రిల్ లో సుప్రీం బెయిల్ నిరాకరించడంతో తీహార్ జైలులోనే 24 నెలలు ఖైదీగా ఉన్నారు. హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కొడుకు అజయ్ చౌతాలా వంటి వారెందరో తీహార్ జైలులో ఉన్నారు. కరడు గట్టిన నేరస్తులకు తీహార్ జైలు నెలవు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకేసులో నిందితుడు సత్వంత్ సింగ్ ను ఈ జైలులోనే ఉరి తీశారు. పార్లమెంటులో దాడి కేసులో నింది తుడు అఫ్జల్ గురును ఇక్కడేఉరితీశారు. దాదాపు 12 హత్యలు చేసిన ఇంటర్నేషనల్ క్రిమినల్ ఛార్లెస్ శోభరాజ్ ను ఇక్కడ నిర్భంధించారు. గాంగ్ స్టర్ ఛోటా రాజన్ ఇక్కడ శిక్ష అనుభవించాడు. ఎందరో రాజకీయనాయకు లు, ఉద్యమ కారులు, ఉగ్రవాదులు పారిశ్రామిక వేత్తలు ఈ జైలులో శిక్షఅనుభవించినా.. ఇది ఆసియాలోనే అతి పెద్ద ఖైదీల సంస్కరణ సంస్థగా తీహార్ జైలు పేరు మోసింది. 

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్