మహేంద్ర సింగ్ ధోని(MSD).. భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ లో ఓ సంచలనం. కెప్టెన్ గా ఎవరికి సాధ్యం కాని ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. మిస్టర్ కూల్ గా పేరు గడించిన ధోని టీమిండియాకు టీ20, వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోపిలను అందించిన ఏకైక సారథిగా చరిత్రకెక్కాడు. అలాగే ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ ట్రోపీలను గెలిచి సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక అతని ధనాధన్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమి ఉంది. క్రీజులో ధోని ఉంటే చివరి ఒంతికైనా గెలుపు మనదే అన్న ధీమాలో ఫ్యాన్స్ ఉంటారు.
అంతలా అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్న MSD.. ఇప్పటికే టీమిండియా క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ధోని కెరీర్ పై కేదార్ జాదవ్(Kedar Jadhav) కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనికి వయసు పెరిగిపోతోందని.. ఇకపై ఆయన శరీరీం క్రికెట్ ఆడటానికి సహకరించకపోవచ్చని చెప్పాడు. బహుశా ఇదే ధోనికి చివరి ఐపీఎల్ కావొచ్చన్నాడు. ఇకపై ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఆడబోయేది ఆసక్తికరంగా ఉండనుందన్నాడు.