బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెబాట పట్టారు. సాగునీరు అందక, భూగర్భ జలాలు అడు గంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్య టించనున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగుతుంది.
జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీ లించడం తోపాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. జనగామజిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతీచోటా రైతులతో ముఖాముఖి సంభాషి స్తారు.దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా, ధర్మాపురం గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పిస్తారు. అక్కడ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, తర్వాత నల్లగొండ జిల్లా హాలియాకు వెళ్లి పంటలను పరిశీలిస్తారు. కేసీఆర్ జనగామ పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేం దుకు జన గామ, స్టేషన్ఫన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన బీఆర్ ఎస్ నాయకులు సిద్ధమవు తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు గడ్డు పరి స్థితులు ఎదురవుతున్న సమయంలో కేసీఆర్ ఆకస్మి కంగా జిల్లాల పర్య టన చేపట్టడం, అది కూడా ఎండిన పంటల పరిశీలనకు రావడం చర్చ నీయాంశమైంది. బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న క్రమంలో ఆయన జిల్లాల పర్యటన ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో భరోసాని వ్వాలని భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు, ఫోన్ ట్యాపింగ్ పరిణామం, కవిత లిక్కర్ కేసు లాంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడంలో భాగంగానే కేసీఆర్ ఈ పర్యటన చేపట్టారన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.