స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుతురు కావ్య కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరికాసేపట్లో ముఖ్య మంత్రి రేవంత్ నివాసానికి కడియం శ్రీహరి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు కడియం శ్రీహరి, కావ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల చివరి జాబితా.. విడుదలకు ముందే కాంగ్రెస్ లో చేరాలని టీపీసీసీ కోరింది. ఈ నేపథ్యంలో కడియం ఇవాళే కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ లో కడియం చేరిన అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించే అవకాశం ఉంది.