స్వతంత్ర, వెబ్ సైట్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా బంజారహిల్స్ లోని రోడ్ నెం10 బంజారా భవన్ లో గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో గిరిజన స్టాల్స్ ను సందర్శిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్ కు అక్కడ స్టాల్స్ నిర్వాహకులు వాటి ప్రత్యేకతలను వివరిచారు. అదే సమయంలో పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి తన చేతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయాలని సూచించారు. నిర్వాకులు పచ్చబొట్టు నొప్పితో కూడినది అని చెప్పినా మంత్రి కేసీఆర్ పేరును వేయాలి అని వారికి తెలిపారు. నొప్పిని భరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు.
కొమురం భీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి పచ్చబొట్టు వేశారని తెలుసుకుని మంత్రి ఆనందించారు. పచ్చబొట్టు వేసినందుకు నగదు బహుమానం అందించారు. అంతరించిపోతున్న గిరిజన సాంస్కృతులను ప్రోత్సాహించాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని మంత్రి పేర్కొన్నారు.


