26 C
Hyderabad
Tuesday, June 10, 2025
spot_img

పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ ఇవాళ తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్‌కి వస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లు కలుపుకొని సుమారు 400 మందికి ఆహ్వానం పంపారు.

ఈ భేటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు చేపట్టాల్సిన రాజకీయ కార్యకలాపాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పేరిట ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ వచ్చే ఏప్రిల్‌ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

వచ్చే రెండు నెలల పాటు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపేలా సన్నాహక కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూలు ప్రకటించే అవకాశముంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్