స్వతంత్ర, వెబ్ డెస్క్: కుటుంబ పాలనతో తెలంగాణ దగా పడుతోందని.. తెలంగాణలో కెసిఆర్ మాఫియా కొనసాగుతోందని మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో అశువులు బాసిన అమరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానం చేశారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి.. అమరుల ఆశయాలు, ఆకాంక్షలు నేరవేరాల్సి వుందని అన్నారు. పదేళ్లలో అప్పుల తెలంగాణగా మారిపోయిందని.. అందుకా తెలంగాణ సాధించుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మత పరమైన రిజర్వేషన్లు రద్దు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఉద్యమ కారుల గొంతు కోసి, ఉద్యమ ద్రోహులకు తెలంగాణాను అప్పజెప్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోసం 111 జీవోను రద్దు చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు మాఫియాగా మారి దళితుల నోటి కాడి కూడును లాక్కుoటున్నారు. కార్పొరేషన్ లన్ని ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో వైద్యారోగ్యo పూర్తిగా కుంటుపడిపాయింది.సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందడం లేదు. సచివాలయానికి కెసిఆర్ రాడు.. ఇతరులను రానివ్వడు..ప్రజలకు పనికిరాని సచివాలయం ఎందుకు…? అంటూ ప్రశ్నను వర్షం కురిపించారు.
సంక్షేమ పథకాలతో భారీ అవినీతి పెరిగిపోయిందన్న మంత్రి. మూడు లక్షల కోట్లకు పైన తెలంగాణ అప్పు ఉందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వివిధ బ్యాంకుల నుంచి దాదాపు లక్ష మూపై వేల కోట్ల రూపాయాలు అప్పు తీసుకుందని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చిందని తెలిపారు.
రైతు రెండు పంటలకు ఏడాదికి 18 వేల కోట్లు కేంద్ర అందిస్తోందని… 25 వేల కోట్లు RRR కోసం కేంద్ర ఖర్చు పెడుతోందన్నారు. కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రోడ్లు నిర్మిస్తోందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాకే రామగుండం పర్టిలైజర్ కర్మాగారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో రెండు వందే భారత్ ట్రైన్ లను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. 700 కోట్లతో సికింద్రబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపడుతున్నామని ఈ మేరకు తెలిపారు.
“దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల ఇండ్లు పేదలకు నిర్మించాం.. ప్రతి ఏడాది రైతులు నష్టపోతున్నారు.. నోటి కాడి కూడు వరద పాలవుతోంది..కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కిసాన్ భీమా తెలంగాణలో అమలు అవడం లేదు…తెలంగాణ ఏర్పాటు కాకముందే.. pv ఎక్స్ప్రెస్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, కృష్ణ, గోదావరి జలాలు వచ్చాయి.. తెలంగాణలో ఒక్ నీతివంతమైన పరిపాలన రావాల్సి ది.. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి.. నాది రాజకీయ ఉపన్యాసం కాదు.. తెలంగాణ ప్రజల గొంతులో రగులుతున్న ఆవేదనలు వ్యక్త పరిచాను” – కిషన్ రెడ్డి


