ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత(kavitha)కు ఈడీ నోటీసులు ఇవ్వడంపై సీఎం కేసీఆర్(KCR) తొలిసారి స్పందించారు. BRS విస్తృతస్థాయి సమావేశంలో కవితకు నోటీసుల గురించి ప్రస్తావన రాగా.. ఈడీ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేయొచ్చని కేసీఆర్ పేర్కొన్నారు. అరెస్ట్ చేస్తారంట. చేయనివ్వండి.. ఏం చేస్తారో చూద్దాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రుల నుంచి ఇప్పుడు కవిత వరకు ఈ వేధింపులు వచ్చాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే వరకు విశ్రమించొద్దని పార్టీ నేతలకు కేసీఆర్(KCR) దిశానిర్దేశం చేశారు. మరోవైపు కవితకు మద్దతుగా మంత్రి కేటీఆర్(KTR) ఢిల్లీ బయలుదేరారు.