స్వతంత్ర వెబ్ డెస్క్: కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోవడం.. అలాగే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడమే దీనికి సంకేతమన్నారు. గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. తన సవాల్ ను స్వీకరించకుండా కేసీఆర్ సిట్టింగుల స్థానాలు మార్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని రేవంత్ అన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పారు.
రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివి తేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 రుణమాఫీ చేసి కేసీఆర్ రూ. 11 వేల కోట్లు మిగుల్చుకున్నారని చెప్పారు. ఒక్క రూపాయి అని అందరు అనుకుంటున్నారు కానీ దాని వల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో పాటు ప్రభుత్వానికి 11 వేల కోట్లు మిగుల్చుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందన్నారు.