20.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

బీఆర్ఎస్‌ నేతలపై కేసీఆర్‌ సీరియస్‌

తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దేనని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ స్పష్టం చేశారు. 7 నెలల తర్వాత తెలంగణ భవన్‌లో అడుగు పెట్టిన కేసీఆర్‌.. పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని గులాబీ బాస్‌ నిర్ణయించారు. ఈ వేడుకలపై పార్టీ శ్రేణులకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ జూబ్లీ వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి బీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టాలని తీర్మానించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలకు ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించారు.

ఈ ఏడాది పొడవునా నిర్వహించే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పార్టీ విజయాలు వివరించాలని చెప్పారు. అలాగే గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

కేసీఆర్‌ సీరియస్‌

పార్టీ నేతలపై అధినేత కేసీఆర్ సీరియస్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటమి పాలవ్వగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారని అన్నారు. ఇలా ప్రచారం చేయడం సరైనది కాదన్నారు.

లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్ట పడాలని సూచించారు కేసీఆర్‌. ప్రజల కోసం పార్టీ నేతలు పని చేయాలని సూచించారు. ఎన్నికల్లో 100 శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని.. ఉప ఎన్నికలకు బీఆర్ఎస్‌ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు.

రేవంత్‌పై కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్‌. ఈ సీఎంకు ఇంతలా ప్రజల్లో వ్యతిరేకత ఇంత త్వరగా వస్తుందనుకోలేదన్నారు. మనం ప్రతి సంవత్సరం ఆదాయం పెంచుకుంటూ పోయామని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని ఆరోపించారు. అదే అధికారులు ఉన్నారు కానీ ఈ ప్రభుత్వానికి చేయించుకోవడం రావడం లేదని విమర్శించారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయి.. అందరూ సిద్దంగా ఉండండి.. మళ్లీ మనదే అధికారం.. మీరే ఎమ్మెల్యేలవుతారు..అని కేసీఆర్‌ అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ ప్రస్థానం, కష్టనష్టాలు వివరించారు. టీడీపీ, ఎన్టీఆర్ నాటి పరిస్థితుల నుంచి పార్టీ శ్రేణులకు వివరించారు. యువ నేతలను ఉద్దేశించి స్పెషల్‌గా మాట్లాడారు. భవిష్యత్తు మీదేనని కష్టపడి పనిచేయాలని సూచించారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంపై వ్యాసాలు, డాక్యుమెంటరీలు రూపొందించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్