పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతో మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఓడించాలనే బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించారని ఆరోపించారు. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌస్ తలుపులు తెరిచారని విమర్శిం చారు. రాహుల్‌గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించా నని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుభ వాలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందన్నారు. జీవన్‌రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయని మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని, అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారని చెప్పారు. విద్యాశాఖ తన పరిధి లోనే ఉందన్న సీఎం రేవంత్ ఇప్పటివరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించామన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


