బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోడీ, అమిత్ షాలకు ఉందా? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆరేళ్ళ జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. బీజేపీ నేతలకు ఈ చరిత్ర ఉందా..? అని నిలదీశారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యారని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.


