Karnataka Elections |కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు వెలువడనుంది. ఉదయం 11గంటల 30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. మొత్తం 224 శాసనసభా స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ గడువు మే 24వ తేదీతో ముగుస్తుంది. దీంతో అప్పటిలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. షెడ్యూల్ విడుదల కాకముందే కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచాయి. కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను సైతం విడుదల చేశాయి.
Karnataka Elections |మరోవైపు వయనాడ్ లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హతతో వయనాడ్ లోక్ సభ స్థానంలో ఖాళీ ఏర్పడింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్ సభ సభ్యత్వాన్ని రద్దైన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ సవాల్ చేయకముందే.. ఇక్కడ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుందా లేదా అనేదానిపై కాసేపట్లో స్పష్టత రానుంది.
Read Also: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్ని ప్రమాదం..
Follow us on: Youtube, Instagram, Google News