- హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా
- కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తీస్తే..ఏకంగా 450 కోట్లు వసూలు
సంచలన విజయంతో రికార్డులు సృష్టించిన కాంతార సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ ఏడాది రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయింది. హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలుత కన్నడలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఆపై తెలుగు సహా పలు భాషల్లోనూ ఈ సినిమాను నిర్మాతలు విడుదల చేశారు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందీ సినిమా. తాజాగా ఆస్కార్ బరిలో నిలిచి మరో ఘనత సాధించింది. కాంతార సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిందని సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. రెండు విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ మూవీ అవార్డు విభాగంతో పాటు బెస్ట్ యాక్టర్ విభాగంలో నామినేట్ అయిందని తెలిపింది. కన్నడిగుల సంప్రదాయ భూత కోల నేపథ్యంలో దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు.