ఆంధ్రప్రదేశ్: విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ ఎదురయింది. అచ్యుతాపురం మండలం, కూడిమడికలో నిర్వహించిన ‘గడపగడప’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నబాబును స్థానికులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కన్నబాబు గో బ్యాక్’, ‘కన్నబాబు వద్దు… జగనన్న ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు జగన్ వరకు చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కన్నబాబు దందాలను అరికట్టాలని ఆయన అరాచకాలు అడ్డుకోవాలని అన్నారు. తప్పులు చేస్తారు.. చేయిస్తారంటూ ప్లకార్డులతో స్థానికులు నిరసనకు దిగారు.


