భారత సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం ఉదయం ప్రముఖ నటి నీలూ కోహ్లీ భర్త హర్మీందర్ సింగ్ ఆకస్మాత్తుగా బాత్రూంలో పడి చనపోగా.. సాయంత్రం కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. తన ఆఫీసులోనే ఉన్నట్టుంది గుండెపోటుకు గురికావడంతో సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కాగా సంచారి, పయన, పారు వైఫ్ ఆఫ్ దేవదాస్, యారిగే యారింటు లాంటి సినిమాలతో పాటు.. తెలుగులో తిరుగుబోతు అనే సినిమాకి కిరణ్ దర్శకత్వం వహించారు.