సీఎం రేవంత్ రెడ్డి పై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతు న్నారన్నారు. రేవంత్ భాష అభ్యంతకరంగా ఉందని.. ఆయన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో.. దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ ప్రగతిని వైఫల్యంగా చూపడం బాధకరమన్నారు. రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దని.. బ్యారేజీ కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చన్నారు.
మేడిగడ్డపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోమని సూచించారు. రాజకీయాల కోసం రైతులను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుందన్నారు. ప్రతిపక్షాలను విమర్శించడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భాష మార్చుకుంటాడని అనుకున్నామన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కడియం మండిపడ్డారు.