26.5 C
Hyderabad
Saturday, March 14, 2026
spot_img

కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట

   మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువ రించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేందుకు తగిన ఆధారాలు చూపలేదని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది. దస్తగిరి వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన అవినాష్ రెడ్డి తండ్రి వై ఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో ఇద్దరు నిందితులైన ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్