ఆంధ్రప్రదేశ్లో నుండి దుష్ట పాలనకు చరమగీతం పాడినట్లు అయిందని కాకినాడ జిల్లా జగ్గంపేట నూతన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఏపీ ప్రజలకు ప్రజాపాలన అందుతుం దని అన్నారు. జగ్గంపేట ప్రజలు తనపై నమ్మకం ఉంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. జగ్గంపేట సెగ్మెంట్ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్య పరంగా సేవలు అందిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుం టానని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మంత్రి పదవులు ఉంటాయని జ్యోతుల తెలిపారు.


