కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రెండు రోజులుగా కమిటీ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీలు, ఇంజినీర్లను కమిటీ విచారిస్తోంది. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన అంశాలపై ఘోష్ కమిటీ విచారణ చేపడుతోంది.బీఆర్కే భవన్లో ఈఈ, ఎస్సీలతో సమావేశం నిర్వహించారు. చంద్రఘోష్ కమిటీ ముందు మాజీ ENC మురళీధర్ రావు, ఇంజినీర్లు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రెండు రోజులుగా రాష్ట్రంలో కమిటీ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు.


