స్వతంత్ర వెబ్ డెస్క్: జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. అలాంటివారి కోసం ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
మేషం
వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిరనిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది. ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. భరణి నక్షత్ర జాతకులకు శుభప్రదమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
వృషభం
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. దూర బంధువులతో కలుస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. మాట పట్టింపులకు పోరాదు. రోహిణి నక్షత్ర జాతకులకు క్షేమకరమైన ఫలితాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన శుభప్రదం.
మిథునం
మనస్సు చంచలంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నవమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరినీ అతిగా నమ్మి మోసపోరాదు. దుర్గాధ్యానం చేస్తే మంచిది.
కర్కాటకం
కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. అష్టమంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పునర్వసు నక్షత్ర జాతకులు దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం మేలు. సూర్యనారాయణమూర్తి సందర్శనం శ్రేయోదాయకం.
సింహం
రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. మీదైన రంగంలో పట్టుదల,ఏకాగ్రతలు మిమ్మల్ని మళ్లీ విజయం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ముందుచూపుతో వ్యవహరించడం వల్ల ముఖ్యమైన విషయాలలో ఇబ్బందులు తొలుగుతాయి. పుబ్బ నక్షత్ర జాతకులు చేసే సాధన సిద్ధిస్తుంది. గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
కన్య
బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు.గొప్పకాలం. ప్రారంభించిన కార్యక్రమాలలో అనుకున్న ఫలితాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగులకు శుభకాలం. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. హస్తా నక్షత్ర జాతకులకు క్షేమకరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభదాయకం.
తుల
సంపూర్ణ ఆత్మబలంతో విజయసిద్ధి కలదు. మీ మీ రంగాల్లో ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. అస్థిర నిర్ణయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
వృశ్చికం
విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలు సిద్ధిస్తాయి. తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. చతుర్దంలో చంద్ర సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. మనఃశ్శాంతి కోసం చంద్రధ్యానం చేయండి.
ధనుస్సు
రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. చేపట్టే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు చేసే సాధనలు ఫలిస్తాయి. విజయం వరిస్తుంది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఎవరినీ అతిగా నమ్మి మోసపోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈశ్వర ధ్యానం చేస్తే మంచిది.
మకరం
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు. శ్రవణా నక్షత్ర జాతకులకు క్షేమకరమైన ఫలితాలు ఉంటాయి. తోటివారి సహకారంతో పనులు చకచకా పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది. మనఃశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. దుర్గా ఆరాధన చేస్తే మంచిది.
కుంభం
చేపట్టే పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు. దైవబలం రక్షిస్తుంది. వ్యాపార పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శతభిషా నక్షత్ర జాతకులు చేసే ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. లక్ష్మీ స్తుతి అదృష్టాన్ని ఇస్తుంది.
మీనం
కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి.పెద్దలతో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు మనసులో అనుకుని మాట్లాడటం మంచిది. ద్వాదశంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నారు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. మనఃశ్శాంతి కోసం ఈశ్వరరాధన చేయాలి.


