Taraka Ratna |సినీ నటుడు తారకరత్న పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరూ తారకరత్న చిత్రపటానికి నివాళులర్పించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) మాత్రం తన సోదరుడు తారకరత్నకు తీవ్ర భావోద్వేగంతో అంజలి ఘటించారు. ఆయన చిత్రపటం ముందు శిరసు వంచి నివాళి అర్పించారు. కాగా టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. దాదాపు ఇరవై రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18వ తేది మహాశివరాత్రి రోజున అనంతలోకాలకు చేరుకున్నారు.
Read Also: BRS ఎమ్మెల్యేగా Dil Raju పోటీ?
Follow us on: Youtube