22.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

చిరుతతో ఫైట్ చేసిన జర్నలిస్టు

     చిరుత పులి కనిపిస్తే చాలు ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడుస్తోంది. అలాంటిది ఓ జర్నలిస్టు ఏకంగా చిరుతతో ఫైట్ చేశాడు. ఇలాంటి సీన్లు సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం..కానీ, రాజ‌స్థాన్‌లో ఓ జర్నలిస్ట్ చిరుతతో పోరాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజస్థాన్‌లోని దుంగార్‌పుర్ భ‌ద‌ర్ మెట్వాల గ్రామంలోకి చిరుత పులి రావటంతో ఆ చిరుతను జనాలు తరిమికొట్టేందుకు ప్రయత్నం చేశారు.అయితే, గ్రామ‌స్తులు రాళ్లు రువ్వుతు చిరుత‌ పులిని బెదిరించారు. ఇక, అక్కడే ఓ వార్తను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్ట్ గున్వంత్ క‌లాల్‌పై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకోవడంతో అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా పట్టేసుకున్నాడు. దాని ద‌వ‌డ‌, మెడ‌ను గ‌ట్టిగా పట్టుకుని.. ఆ తర్వాత చిరుత పులిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్