19.2 C
Hyderabad
Friday, November 8, 2024
spot_img

తెలంగాణలో జియో ఫైర్ సేఫ్టీ క్యాంపెయిన్‌

హైదరాబాద్, 14 సెప్టెంబర్ 2023: రిలయన్స్ జియో తన నెట్వర్క్ సైట్‌లు మరియు సౌకర్యాల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో తెలంగాణలో “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023″ని ప్రారంభించింది.
“ఫైర్ ప్రివెన్షన్ – మస్ట్ ఫర్ నెట్‌వర్క్ అవైలబిలిటి అండ్ సర్వీస్ తో కస్టమర్” అనే థీమ్ తో ఈ సమగ్ర ప్రచారాన్ని జియో తెలంగాణ ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 15, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ నిర్వహణ పాయింట్లు , జియో సెంటర్‌ ప్రాంతాలు మరియు అన్ని నెట్‌వర్క్‌ సైట్ లను కవర్ చేస్తూ నిర్వహిస్తోంది.

జియో ఉద్యోగులు, సర్వీస్ పార్టనర్ ఉద్యోగులు మరియు ఇతర వాటాదారులలో అగ్ని ప్రమాదాల పై భద్రత యొక్క లోతైన భావాన్ని కలిగించడం ఈ ప్రచారం యొక్క ప్రాథమిక లక్ష్యం. వారి నైపుణ్యాలు, పరిజ్ఞానం మరియు అవగాహన పెంచడం ద్వారా అగ్ని ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది, “జీరో ఫైర్ ఇన్సిడెంట్ ఎట్ సైట్” కోసం జియో ప్రయత్నిస్తోంది.

తన ఉద్యోగులు, సేవా భాగస్వాముల శ్రేయస్సు మరియు నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క అంతరాయం లేని సేవలకు అగ్నిమాపక భద్రత చాలా ముఖ్యమైనదని జియో తెలంగాణ భావిస్తోంది. ఫైర్-సంబంధిత సంఘటనలను నివారించడంలో ఫీల్డ్ టీమ్‌లలో ఫైర్ సేఫ్టీ అవగాహన చాలా కీలకమని కంపెనీ గుర్తించింది. ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా, ఫైర్ ప్రివెన్షన్ మరియు సేఫ్టీ ప్రోటోకాల్స్‌పై సమగ్ర శిక్షణా సెషన్‌లు; ఫైర్ సేఫ్టీ కసరత్తులు, వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించింది. అగ్ని మాపక భద్రత మరియు నివారణ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా, జియో తెలంగాణ తన నెట్వర్క్ సైట్ల సౌకర్యాలను కాపాడటమే కాకుండా నెట్‌వర్క్ విశ్వసనీయతకు, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Latest Articles

విట్ వర్సిటీలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

ఐటీ రంగం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు చేసిన కృషి వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయని అన్నారు మంత్రి లోకేష్. అమరావతిలోని విట్‌ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శన కార్యక్రమంలో.. మంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్