ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో .. జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్ యూజర్లు 14 ఓటీటీ యాప్స్‌ను వినియోగించుకునేలా సింగిల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందుకోసం మూడు వేర్వేరు ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఒకే రీఛార్జిపై వివిధ ఓటీటీ సేవలను పొందేందుకు జియోటీవీ ప్రీమియం ప్లాన్ ఉపయోగపడనుంది.
జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల కాలవ్యవధిపై మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. వీటి ధరలను రూ.398, రూ.1198, రూ.4,498గా నిర్ణయించింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్లతో లభిస్తాయి. జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్), సన్ నెక్ట్స్ వంటి 14 ఓటీటీ యాప్స్‌ను వీక్షించొచ్చు. వార్షిక ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. డిసెంబర్ 16 నుంచి ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయని జియో తెలిపింది. జియో మొబైల్ నంబర్‌తో జియో టీవీ ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను మైజియో యాప్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌ను వినియోగించాలంటే నేరుగా జియో నంబర్‌తో లాగిన్ అవ్వొచ్చు. మై జియో యాప్‌లో కూపన్ సెక్షన్‌లోకి వెళ్లి జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు.