నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ఈ రోజు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జెఇఇ) మెయిన్ 2025 సెషన్ 1 కోసం స్కోర్‌కార్డులను విడుదల చేసింది. పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఫలితాలను యాక్సెస్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్: jeemain.nta.nic.in ని సందర్శించవచ్చు. ఫలితాలను చూసుకోవాలంటే లాగిన్ వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది.
స్కోర్‌కార్డ్‌లను తెలుసుకోవాలంటే..
1: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – jeemain.nta.nic.in
2: హోమ్‌పేజీలో, తాజా న్యూస్ టాబ్ కోసం చూడండి
3: JEE ప్రధాన సెషన్ 1 ఫలిత స్కోర్‌ల లింక్‌పై క్లిక్ చేయండి
4: రిజిస్ట్రేషన్ సంఖ్య , పాస్‌వర్డ్/పుట్టిన తేదీని నమోదు చేయండి
5: స్క్రీన్‌పై ఫలితం కనిపిస్తుంది
సుమారు 14 మంది విద్యార్థులు పేపర్ 1 (BE/BTECH) లో 100 పర్సంటైల్ స్కోరును సాధించారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ ఉండటం విశేషం. రాజస్థాన్‌కు చెందిన ఆయుష్ సింఘాల్, కర్ణాటకకు చెందిన కుషగ్రా గుప్తా, ఢిల్లీకి చెందిన దక్ష్ టాపర్లుగా నిలిచారు. పూర్తి జాబితాను NTA అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరుగుతాయి. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.