30.9 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న జేడీ చక్రవర్తి

తన విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకున్న జేడీ చక్రవర్తి ప్రస్తుతం మళ్లీ నటుడిగా ఫుల్ బిజీగా మారుతున్నారు. సిల్వర్ స్క్రీన్, ఓటీటీ ఇలా అన్ని రకాల మాధ్యమాల్లో కొత్త కంటెంట్‌ను ఎంచుకుంటున్నారు. కొత్త కథలు, భిన్న పాత్రలు ఆయన వద్దకే వస్తున్నాయి. అలా జేడీ చక్రవర్తి ఈ మధ్య ‘దయా’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.

ఓటీటీ ప్లే అనే సంస్థ దేశ వ్యాప్తంగా వచ్చిన ఓటీటీ కంటెంట్‌లో ది బెస్ట్ ఎంచుకుంది. ఓటీటీలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్‌లకు అవార్డులను ఇచ్చింది. ఈ అవార్డుల్లో భాగంగా దయా వెబ్ సిరీస్‌కు రెండు అవార్డులు వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ‘దయా’కు అవార్డులు వచ్చాయి. దర్శకుడు పావన్ సాధినేని, హీరో జేడీ చక్రవర్తిలకు ఈ అవార్డులు వచ్చాయి.

జేడీ చక్రవర్తికి ఇలా అవార్డులు రావడం అనేది కొత్త కాదు. దహిణి ది విచ్ అనే సినిమాకు గానూ నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు వచ్చింది. ఇక దయా వెబ్ సిరీస్‌కు వచ్చేసరికి ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందులో జేడీ చక్రవర్తి పాత్ర, ఆ పాత్రను మలిచిన తీరు, ఇచ్చిన ట్విస్టులు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్