టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar reddy)తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యువగళం పాదయాత్రలో లోకేశ్(Lokesh)ను చూసి చాలా బాధ కలిగిందన్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న లోకేశ్ అరికాళ్లకు బొబ్బలు చూసి తన కళ్లలో నుంచి నీళ్లు తిరిగాయని అంటూ కంటతడి పెట్టారు. రాష్ట్రం, ప్రజల బాగు కోసం బొబ్బలను కూడా లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్న లోకేశ్(Lokesh)ను చూస్తే గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు, సతీమణికి నమస్కారాలు తెలియజేస్తున్నానని తెలిపారు.
తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి(JC Ashmit reddy) లోకేశ్ తో కలిసి మూడు రోజులు మాత్రమే పాదయాత్ర చేశాడని.. ఇప్పుడు కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పాదయత్ర చేస్తున్న లోకేశ్ గొప్ప లీడర్ అని కొనియాడారు. ఏపీ బాగుపడాలంలే చంద్రబాబు(Chandrababu) మళ్లీ సీఎం కావాలని జేసీ ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు లోకేశ్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో విజయవంతమైనందుకు బాణసంచా కాల్చడంతో జేసీ అనుచరులపై పోలీసులు కేసులు నమోదుచేశారు.


