మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలితకు చెందిన ఆస్తులకు సంబంధించి సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జప్తు చేసిన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌కు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు.. జనవరి 1న పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఆమె దోషిగా తేలారు. కానీ ఆమె 2016లో మరణించారు. తర్వాత ఈ కేసు విచారణను కోర్టు నిలిపివేసింది. ఆమె ఆస్తుల జప్తును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే జయలలితపై ఉన్న కేసును కొట్టివేశారు కాబట్టి.. ఆమె ఆస్తులను సైతం జప్తు చేయకూడదని ఆమె తరపు బంధువులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఇతరులను దోషులుగా నిర్ధారించిందని.. అందువల్ల ఆస్తుల జప్తు చేయొచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
జయలలిత ఆస్తులు ఇవే..
జయలలితకు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో నివాసం – వేద నిలయం, డీఏ కేసుతో ముడిపడి ఉన్న అనేక భూములు ఉన్నాయి. ఆమెకు ఎస్టేట్ కూడా ఉంది. అలాగే ఆమె పేరు మీద బ్యాంకు డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. సీబీఐ కోర్టు ఆదేశాల ప్రకారం.. జయలలిత ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కానున్నాయి.