స్వతంత్ర వెబ్ డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) హీరోగా నటిస్తున్న భారతీయ సినిమా ‘దేవర'(Devara). ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కుమార్తె, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తున్న సంగతి ప్రేక్షకులకు కూడా తెలుసు. భారతీయ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. అయితే… జాన్వీకి తొలి తెలుగు సినిమా ఇది. దేవరలో ఆమె ఫస్ట్ లుక్ చాలా కాలం క్రితం విడుదలైంది. అయితే తాజాగా శ్రీదేవిని తలపించేలా జాన్వీ లుక్ దేవర సెట్ నుంచి విడుదలైంది.
జాన్వీ కపూర్ విలేజ్ గర్ల్ లుక్(Village girl look)లో ఉన్న తన చిత్రాన్ని పోస్ట్ చేసి, ఈ సినిమాలో తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. సినిమా సెట్స్ నుంచి మంగళవారం ఆమె కొత్త స్టిల్ విడుదల చేశారు. ఇటీవల వరకు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ‘దేవర’ షూటింగ్ చేశారు. ఇప్పుడు గోవాకు యూనిట్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ కొన్ని సీన్లు తీస్తున్నారు. ఆ తర్వాత గోకర్ణ వెళతారు.
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తారన్న ప్రచారం ఎప్పుడో మొదలైంది. ఎన్టీఆర్ శ్రీదేవి(NTR – Sridevi) సక్సెస్‌ఫుల్ కాంబో కావటంతో… జూనియర్‌తో జాన్వీ జోడి కడితే.. సౌత్‌లో ఆమెకు గ్రాండ్ వెల్‌కం దక్కుతుందని భావించారు. ఆ అంచనాలతోనే జాన్వీని ఏరి కోరి హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఆఫ్ స్క్రీన్ గ్లామర్ ఇమేజ్‌తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ, ఆన్ స్క్రీన్ మాత్రం డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. అయితే బీటౌన్‌లో హోమ్లీగా కనిపిస్తున్నా ఇంత వరకు డీగ్లామ్ రోల్(Deglam Roll) మాత్రం చేయలేదు. టాలీవుడ్ డెబ్యూ(Tollywood Debut)లో మాత్రం ఆ ప్రయోగం కూడా చేయబోతున్నారు.
దేవర సినిమా విలేజ్ గర్ల్ రోల్ ప్లే చేస్తున్న జాన్వీ ఫస్ట్ టైమ్ డీ గ్లామ్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ షూటింగ్‌లో యాక్షన్ సీన్‌లోనూ నటించారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌ను దేవర(Devara) కోసం ప్లే చేస్తున్నారు ఈ బ్యూటీ. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కాంబో కావటం, ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తుండటం, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) విలన్ రోల్ ప్లే చేస్తుడటంతో దేవర మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. దీనికి తోడు జాన్వీ యాక్షన్ సీన్ కూడా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో ఆ హైప్ నెక్ట్స్ లెవల్‌కు చేరింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ ఫస్ట్ పార్ట్
‘దేవర’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు కొన్నాళ్ళ క్రితం దర్శకుడు కొరటాల శివ(Koratala Shiva) తెలిపారు. అందులో తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దేవర’ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతలు. ‘విక్రమ్’, ‘జైలర్’, ‘జవాన్’… వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
‘దేవర’ సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య పాత్రలో సీరియల్ నటి చైత్ర రాయ్(Chaitra Roy), కీలక పాత్రలో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప(Tarak Ponnappa) నటిస్తున్నారు. నటి హిమజ సైతం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చిన, ‘నాటు నాటు…’ పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. దాంతో సినిమాపై క్రేజ్ నెలకొంది.