Jangaon | తెలంగాణలోని జనగామ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్యను జీర్ణించుకోలేక జనగామ ఎస్సై కాసర్ల శ్రీనివాస్(Jangaon SI Srinivas) తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో పట్టణం అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. దంపతుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా.. తీవ్ర మనస్థాపానికి గురైన భార్య స్వరూప బాత్రూంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆమె మరణంతో మనోవేదనకు గురైన ఎస్సై శ్రీనివాస్ కూడా వెంటనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఎస్సై శ్రీనివాస్ ఇలా చనిపోవడం పోలీసులను కూడా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కుటుంబ కలహాలే దంపతుల ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: గత సెప్టెంబర్ తర్వాత 5వేలు దాటిన కరోనా కేసులు
Follow us on: Youtube, Instagram, Google News