28.2 C
Hyderabad
Friday, March 20, 2026
spot_img

పొత్తులతోనే ఎన్నికలకు.. సీఎం రేసులో మాత్రం లేను: పవన్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో పొత్తులపై మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కొనేందుకు కచ్చితంగా పొత్తులతోనే పోటీ చేస్తామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఒకప్పుడు పొత్తులు పెట్టుకునే బలపడ్డాయని పేర్కొన్నారు. పొత్తుల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నా.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు. పొత్తులకు సీఎం పదవి ప్రామాణికం కాదని.. తాను అలాంటి కండిషన్లు పెట్టనని తెలిపారు.

గత ఎన్నికల్లో తనకు ఓ 30-40 సీట్లు ఇచ్చి ఉంటే కచ్చితంగా సీఎం రేసులో ఉండేవాడినని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆగడాలకు చెక్ పెట్టేందుకు బలమున్న ప్రధాన పార్టీలు కలిసి నడవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం జూన్‌ నెల నుంచే ప్రజల్లో ఉంటానని.. వైకాపా దాష్టీకాన్ని బలంగా ఎదుర్కొంటామని జనసేనాని స్పష్టం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్