30.2 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్న జనసేనాని

      జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్నారు. తొలి లిస్టులో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించు కున్నారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులను పరిశీలించి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.అయితే ఐదుగురు అభ్యర్థులకు పవన్ కాల్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలో నేతలతో బుధవారం సాయంత్రం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. భీమవరం-రామంజనేయులు, రాజోలు- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, నరసా పురం-బొమ్మడి నాయకర్,ఉంగుటూరు- ధర్మరాజు, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పవన్ ఖరారు చేశారు. ఇప్పటికే ఒక్కో అభ్యర్థితో పవన్ కల్యాణ్ స్వయంగా మాట్లాడారు. ఇవాళ జనసేన అభ్యర్థుల పూ ర్తి జాబితాను విడుదల చేయనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్